వ్యవసాయ పథకాలు: లోక్‌సభ క్వశ్చన్ హవర్ లో (మార్చి 18, 2025) చర్చించబడిన ప్రధానాంశాలు

18 మార్చి 2025 న లోక్‌సభ క్వశ్చన్ హవర్ లో కొన్ని ప్ర‌ధానమైన వ్యవసాయ కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. ఇందులో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (PMKSY), పర్ డ్రాప్ మోర్ క్రాప్ స్కీమ్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు, వీటి ప్రభావం, అమలు విధానం, భవిష్యత్తు ప్రణాళికలు గురించి చర్చ జరిగింది.

ఆ చర్చలోని కొన్ని ప్రధానాంశాలు:

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)

ఈ పథకం కింద రైతులు ఎంత ప్రీమియం చెల్లించారు, ఎంత నష్టపరిహారం ప్రభుత్వం రైతులకు అందించింది అనే విషయాలను గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ప్రశ్నించగా, ఆయన సంబంధిత వివరాలను వెల్లడించారు.

  • ₹32,475 కోట్లు రైతులచే ప్రీమియంగా చెల్లించబడ్డాయి.
  • 19.59 కోట్లు రైతుల దరఖాస్తులు అందాయి.
  • ₹1,72,231 కోట్లు నష్టపరిహారంగా చెల్లించబడింది, ఇది రైతులు చెల్లించిన ప్రీమియం కంటే సుమారు 5 రెట్లు ఎక్కువ.

ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (PMKSY) & పర్ డ్రాప్ మోర్ క్రాప్ స్కీమ్

నీటి పొదుపు మరియు సాగు విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ విధంగా వివరించారు:

  • ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (PMKSY) పథకం కింద నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వ, సామూహిక నీటి నిల్వ కేంద్రాలను ప్రోత్సహిస్తున్నారు.
  • చిన్న రైతులకు 55% సబ్సిడీ, ఇతర రైతులకు 45% సబ్సిడీ అందిస్తున్నారు.
  • పర్ డ్రాప్ మోర్ క్రాప్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు 9.7 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో-ఇరిగేషన్ విధానం అమలు అయ్యింది.
  • డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానాల వల్ల 70% నీటి పొదుపు సాధ్యమైందని చెప్పారు.

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ & అగ్రి స్టాక్

వ్యవసాయ మంత్రి గారు డిజిటల్ వ్యవసాయ మిషన్ గురించి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు:

  • డిజిటల్ ఫార్మర్ ID ద్వారా రైతులు ప్రభుత్వ పథకాలను సులభంగా పొందగలరు.
  • పంట రుణాలు, నష్టపరిహారం, మార్కెట్లో పంట విక్రయాలన్నీ డిజిటల్ ధృవీకరణ ద్వారా సులభతరం అవుతాయి.

అంతేకాకుండా, కౌలు రైతులు మరియు వ్యవసాయ కూలీలను అగ్రి స్టాక్ రిజిస్ట్రీ లో చేర్చవచ్చా? అనే ప్రశ్నపై కూడా చర్చ జరిగింది. ప్రారంభంలో భూమి ఉన్న రైతులనే ఈ రిజిస్ట్రీ లో చేర్చేందుకు అవకాశం కల్పించటం జరిగింది. అయితే, కౌలు రైతులు మరియు వ్యవసాయ కూలీలను క్రమంగా చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను సూచించామని, మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని తెలిపారు.

Leave a Comment