కంది, మినుములు పండించే రైతులకు మద్దతు – 100% ఉత్పత్తిని కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

గౌరవనీయులైన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 2025 మార్చి 27న విలేకరులు తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. 2024-25 సంవత్సరం లో దేశం లోని రైతులు పండించిన 100 శాతం మినుములు, కంది మరియు మసూరి పప్పు పంటను కనీస మద్దతు ధరకు(MSP) కొనుగోలు చేయటానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది అని మంత్రి గారు తెలిపారు. 

అనగా ఈ మూడు పంటలకు సంబంధించి కొనుగోలు చేయుటకు ప్రభుతవం తరఫున నుంచి పరిమాణ పరిమితులు లేవు అని, దేశం లోని రైతులు మొత్తం ఎంత పంటను ఉత్త్పత్తి చేస్తే, అంత పంటను కొనుగోలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వారు తెలిపారు. ధర మద్దతు పథకం (PSS) క్రింద కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. 

భారత దేశం గత కొద్ది సంవత్సరాలుగా పప్పు ధాన్యాలను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అని వారు తెలిపారు. రైతులను మరింత పప్పు ధాన్యాలు ఉత్త్పతి చేయుటకు ప్రోత్సహించి తద్వారా దేశం పప్పు ధాన్యాల ఉత్త్పతి లో స్వయం సమృద్ధి సాధించటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.

ఈ పథకం వినియోగించుకునేందుకు రైతులు ముందుగా NAFED, NCCF పోర్టల్స్ లో రిజిస్టర్ అవ్వాలి. రైతులు ఉత్పాదన చేసిన పంటను సేకరించుటకు సమర్థవంతమైన మరియు పారదర్శకమైన సేకరణ ఏర్పాట్లను చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి గారు విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, చ్చత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రలలో ఖరీఫ్ 2024-25 సీజన్లో పండించిన కందులని ప్రభుత్వం వారు ధర మద్దతు పథకం క్రింద కొనుగోలు చేస్తున్నారు. మార్చ్ 25, 2025 తేదీ నాటికి దాదాపు 2.46 లక్ష మెట్రిక్ టన్నులు కందిని కొనుగోలు చేశాం అని, 1,71,569 మంది రైతులు లబ్ది పొందారు అని మంత్రి గారు తెలిపారు.

కంది, మినుములు, మసూరి పప్పు మాత్రామే కాకుండా ఇంకా పెసలు, ఆవాలు, ఎండు కొబ్బరి మరియు ఇతర పప్పు ధాన్యాలను PM-AASHA పథకం క్రింద కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల నుండి సేకరించుటకు ప్రభుత్వం ఆమోదించింది. 

సేకరణ కోసం ఆమోదించబడిన పరిమాణాలు ఇక్కడ ఉన్నాయి:

పెసలు: 27.99 లక్షల మెట్రిక్ టన్నులు

ఆవాలు: 28.28 లక్షల మెట్రిక్ టన్నులు

ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత విషయాలపై సమాచారం పొందేందుకు మన దేశీఖేతి తెలుగు వాట్సాప్ ఛానల్‌ను జాయిన్ అవండి.

లింక్ – దేశీఖేతి తెలుగు వాట్సాప్ ఛానల్‌

Leave a Comment